ప్రభుత్వ రంగ బ్యాంకులు సమీప భవిష్యత్‌లో విలీన ప్రక్రియలో సవాలును ఎదుర్కోబోతున్నాయని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ అన్నారు. పది బ్యాంకులను విలీనం చేస్తూ గతేడాది ఆగస్టులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రజనీశ్ మాట్లాడుతూ.. సమీప భవిష్యత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఓ సవాలును ఎదుర్కోబోతున్నాయన్నారు. ప్రస్తుతం బ్యాంకులు విలీన ప్రక్రియ మధ్యలో ఉన్నాయన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటిగ్రేషనే అసలు సమస్య అని రజనీశ్ కుమార్ పేర్కొన్నారు.
విలీనం ఇలా..
2017 ఏప్రిల్‌లో ఎస్‌బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్ విలీనం అయ్యాయి. దీనితో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం కానున్నాయి. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్; యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్; ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులు నాలుగు బ్యాంకులుగా విలీనం కానున్నాయి. దీనితో 2017లో 27గా ఉన్న బ్యాంకుల సంఖ్య విలీనం అనంతరం 12కు చేరనుంది.
ఇదీ చూడండి: భూసంస్కరణలకు తావివ్వని నిర్మలమ్మ బడ్జెట్