Stock Market: సోమవారం ఆద్యంతం ఊగిసలాటతో సాగిన స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. కార్పొరేట్ సంస్థల ఆశాజనక క్యూ3 ఫలితాలు మదపర్లపై సానుకూల ప్రభావం చూపాయి. బ్యారెల్ ముడి చమురు ధర 86డాలర్ల పైకి చేరడం, బాండ్లపై రాబడి పెరగడం వంటి కారణాల వల్ల మార్కెట్లు మధ్యాహ్నం సెషన్ వరకు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు సెన్సెక్స్ 85 పాయింట్ల లాభంతో 61,308వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు వృద్ధి చెంది 18,308 వద్ద స్థిరపడింది.
హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, ఒఎన్జీసీ షేర్లు ప్రధానంగా లాభాలు ఆర్జించాయి.
హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, సిప్లా షేర్లు లాభాలు చవిచూశాయి.
ఇదీ చదవండి: మరో టీకాపై డీసీజీఐ నజర్- ట్రయల్స్ డేటా పరిశీలన!