ఐటీ షేర్ల అండతో దేశీయ స్టాక్‌మార్కెట్లు రాణిస్తున్నాయి. అయితే కరోనా భయాలు మార్కెట్ల లాభాలను పరిమితం చేస్తున్నాయని ట్రేడింగ్ నిపుణులు చెబుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 243 పాయింట్లు లాభపడి 36 వేల 295 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 10 వేల 667 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా, రిలయన్స్ రాణిస్తున్నాయి.
ఐటీసీ, ఎన్టీపీసీ, టైటాన్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా...
షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కాగా వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది.
చమురు ధర
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.55 శాతం పడిపోయింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 43.55 డాలర్లుగా ఉంది.