Stock Market Live: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా పెరిగి 56 వేల 600 ఎగువన ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 250 పాయింట్ల లాభంతో.. 17 వేలకు చేరువలో ఉంది.
లాభనష్టాల్లో ఇవే..
హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, గ్రేసిమ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
సిప్లా, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, సన్ ఫార్మా నష్టపోయాయి.
ఇవీ చూడండి: చైనా కంపెనీలకు పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ డేటా లీక్.. నిజమెంత?