భారీ నష్టాలు...
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 666 పాయింట్ల నష్టంతో 38,800 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 210 పాయింట్ల దిగువన 11,437 వద్ద ట్రేడ్ అవుతోంది.
బీఎస్ఈ-30లో ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్ మినహా అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.