ప్రారంభం నుంచి ఒడుదొడుకులు ఎదుర్కొన్న దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. మోదీ ప్రకటించిన కరోనా ప్యాకేజీ మార్కెట్లను పెద్దగా ఆకట్టుకోకపోవడం, మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 25 పాయింట్లు కోల్పోయి 31 వేల 97 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 9 వేల 136 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో...
భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా రాణించాయి.
ఎమ్ అండ్ ఎమ్, యాక్సిస్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా నష్టాలు చవిచూశాయి.
ఇదీ చూడండి: కరోనా ప్యాకేజీలో కౌలు రైతుల ఊసేది?