ETV Bharat / business

దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణికులు - కొవిడ్​ సమయంలో విమానయానం

దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది ప్రయాణికుల సంఖ్యతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు రెట్లుకుపైగా పెరిగినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్‌ నెలలో 5.18లక్షలు మంది విదేశీ ప్రయాణం చేయగా.. 59.94లక్షల మంది స్వదేశీ ప్రయాణం చేశారు.

air passengers
విమానం, ప్రయాణికులు
author img

By

Published : Aug 12, 2021, 10:35 AM IST

Updated : Aug 12, 2021, 6:24 PM IST

కొవిడ్‌తో ప్రయాణాల పంథా మారుతోంది. ప్రజలు తక్కువ సమయంలో గమ్యస్థానాలు చేరుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్డు, రైలు ప్రయాణాలకు ఎక్కువ సమయం తీసుకుంటుండడం, విమాన ఛార్జీలు కూడా దగ్గర దగ్గరగా అంతే ఉంటుండడం వల్ల సమయం ఆదా కోసం ఆసక్తి చూపుతున్నారు. కొవిడ్‌ సమయంలో.. రోడ్డు, రైలు ప్రయాణాలకు ఆసక్తి చూపడం లేదు. విమాన ప్రయాణాలకు అవకాశం ఉన్న చోట్ల ప్రజలు తమ రాకపోకలకు విమానయానాన్నే ఎంచుకుంటున్నారు.

కొవిడ్‌ మూలంగా గత ఆర్థిక ఏడాదిలో విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే రెండో దశ కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపినా.. విమానయాన ప్రయాణంపై గత ఏడాది కంటే తక్కువేనని ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 5,58,644 మంది విదేశాలకు ప్రయాణం చేయగా, ఈ ఆర్థిక ఏడాది జూన్‌ వరకు మొదటి మూడు నెలల్లో 23,90,644 మంది ప్రయాణం చేసినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా గణాంకాలు స్పష్టం చేశాయి. అదే విధంగా జూన్‌ నెలలో ప్రయాణించిన సంఖ్యను పరిశీలించినట్లయితే.. 2020లో 3,94,938 మంది విదేశాలకు ప్రయాణం చేయగా, 2021లో 5,18,039 మంది విదేశాలకు ప్రయాణం చేశారు.

అంటే గత ఏడాది మూడు నెలల్లో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య కంటే 1,23,101 మంది అధికంగా ప్రయాణం చేశారు. అదే విధంగా డొమెస్టిక్‌ ప్రయాణికుల ప్రయాణాలను పరిశీలించినట్లయితే గత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో 44, 66,239 మంది ప్రయాణించగా ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో రెండు కోట్ల, 10, 41,905 మంది ప్రయాణించారు. అంటే అంతకు ముందు ఆర్థిక ఏడాది మూడు నెలల కంటే కోటి 65,75,666 మంది అధికంగా ప్రయాణించారు.

జూన్‌ నెల వరకు విదేశీ, స్వదేశీ ప్రయాణీకుల సంఖ్యను పరిశీలించిగా.. అంతకు ముందు ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో 50,24,883 మంది విమానయానం చేయగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండు కోట్ల 34, 32, 833 మంది ప్రయాణాలు కొనసాగించారు. అదే జూన్‌ ఒక్క నెలలో ప్రయాణీకుల సంఖ్యను పరిశీలించినట్లయితే అంతకు ముందు ఏడాది జూన్‌లో 42,92,042 మంది ప్రయాణం చేయగా ఈ ఏడాది జూన్‌ నెలలో 65,12,638 మంది ప్రయాణం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో...

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలోని విమానాశ్రయాల వారీగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో విమానయానం చేసిన విదేశీ, స్వదేశీ ప్రయాణీకుల సంఖ్యను ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో జరిగిన ప్రయాణికుల సంఖ్యను పరిశీలించినట్లయితే.. విజయవాడ నుంచి అంతకు ముందే ఆర్థిక ఏడాదిలో 23,377 మంది ప్రయాణించగా ఈ ఆర్థిక ఏడాదిలో 88,734 మంది ప్రయాణించారు. తిరుపతి నుంచి అంతకు ముందు ఏడాదిలో 7,727 మంది ప్రయాణం సాగించగా ఈ ఆర్థిక సంవత్సరం 61,079 మంది ప్రయాణించారు.

హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 3,27, 280 మంది ప్రయాణం చేయగా, ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో 15,32, 627 మంది ప్రయాణం చేశారు. విశాఖపట్నం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 47,510 మంది ప్రయాణం చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2, 21,980 మంది ప్రయాణం చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా రాజమండ్రి ఎయిర్‌ పోర్టు నుంచి గత ఏడాదిలో 8,614 మంది ప్రయాణాలు చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో 43,287 మంది ప్రయాణించారు. కడప నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 3,497 మంది ప్రయాణం చేయగా ఈ ఆర్థిక ఏడాదిలో 5,771 మంది ప్రయాణం చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చదవండి:'అప్పటికల్లా రూ.75లక్షల కోట్లకు ఎగుమతులు'

Last Updated : Aug 12, 2021, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.