ETV Bharat / business

'మారటోరియం వడ్డీ రూ.6 లక్షల కోట్లు దాటిపోతుంది'

author img

By

Published : Dec 9, 2020, 9:10 AM IST

కరోనా నేపథ్యంలో భారతీయ రిజర్వ్​ బ్యాంకు (ఆర్​బీఐ) ప్రకటించిన మారటోరియం కాలానికి సంబంధించి కీలక నివేదికను సుప్రీంకోర్టుకు అందించారు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. కొవిడ్​ దృష్ట్యా ఆరు నెలల మారటోరియం కాలంలో రుణగ్రహీతల అన్నిరకాల రుణాలపై వడ్డీని రద్దు చేయలేమని స్పష్టం చేశారు. అలా చేస్తే రూ.6 లక్షల కోట్లు దాటిపోతుందని ధర్మాసనానికి నివేదించారు.

solicitor general tushar mehta submit report to SC over maratorium
'అలా చేస్తే దేశ ఆర్థిక, బ్యాంకింగ్​ వ్యవస్థలు కుదేలు!'

కొవిడ్​-19 మహమ్మారి దృష్ట్యా ఆర్​బీఐ ప్రకటించిన ఆరు నెలల మారటోరియం కాలానికి అన్ని వర్గాల రుణగ్రహీతల అన్ని రకాల రుణాలపై వడ్డీని రద్దు చేసినట్లైతే ఆ మొత్తం రూ. 6 లక్షల కోట్లు దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఒకవేళ బ్యాంకులు ఈ మొత్తాన్ని భరించినట్లైతే అవన్నీ తప్పనిసరిగా తమ నికర విలువలో ఎక్కువ భాగాన్ని తుడిచిపెట్టేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చాలా ఆర్థిక సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఎం.ఆర్​.షా, జస్టిస్​ ఆర్​.ఎస్​.రెడ్డిల సుప్రీంకోర్టు ధర్మాసనానికి కేంద్రం తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా నివేదించారు. వడ్డీ మాఫీ అంశం గురించి ఆలోచించడానికి, వాయిదా మొత్తాల చెల్లింపును మాత్రమే వాయిదా వేయడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పారు.

కొవిడ్​-19 మహమ్మారి నేపథ్యంలో రంగాల వారీగా ఉపశమన చర్యలు చేపట్టాలంటూ స్థిరాస్తి, విద్యుత్తు రంగాల సంస్థలు సహా వివిధ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకులిఖిత పూర్వకంగా సమర్పించిన అంశాల వివరాలను మెహతా చదివి వినిపించారు. మారటోరియం కాలానికి సంబంధించి అన్నిరకాల రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే ఆ మొత్తం రూ.6 లక్షల కోట్లు దాటిపోతుందని చెప్పారు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) కనుక వడ్డీని రద్దు చేస్తే..ఆ బ్యాంకు 65 సంవత్సరాలుగా కూడబెట్టుకున్న విలువలోని సగ భాగం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు.

"డిపాజిట్​ చేసినవారికి వడ్డీ చెల్లింపులు కొనసాగించటం అత్యవసర బ్యాంకింగ్​ కార్యకలాపం మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా నెరవేర్చాల్సిన అంశం. ఎందుకంటే చాలా మంది చిన్న డిపాజిట్​దారులు, పింఛనర్లు. వీరంతా తమ డిపాజిట్​లపై వచ్చే వడ్డీపై ఆధారపడి జీవిస్తున్నారు"

-- సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా

రిజర్వ్​ బ్యాంక్​ ప్రకటించిన మారటోరియం కాలానికి సంబంధించి ఎస్​బీఐ రుణగ్రహీతల నుంచి వసూలు చేయాల్సిన వడ్డీ సుమారు రూ. 88,078 కోట్లుగా ఉండగా, డిపాజిటర్లకు చెల్లించాల్సిన వడ్డీ సుమారు రూ.75,157 కోట్లుగా ఉందని భారతీయ బ్యాంకుల సంఘం సెప్టెంబర్​ 25న దాఖలు చేసిన ప్రమాణపత్రాన్ని ఈ సందర్భంగా మెహతా ప్రస్తావించారు. కొవిడ్​-19ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కేంద్రం అనేక ఉపశమన చర్యలు చేపట్టిన సంగతిని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇక మరిన్ని ఉపశమన చర్యలు అంటే..దేశ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చని, దేశ ఆర్థిక, బ్యాంకింగ్​ వ్యవస్థలు ఆ పరిస్థితిని తట్టుకోలేవని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: దిల్లీ సరిహద్దులో 14వ రోజుకు చేరిన అన్నదాతల దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.