ETV Bharat / business

టిక్​టాక్​కు 'స్వదేశీ' సవాల్​- దూసుకెళ్తున్న చింగారీ!

author img

By

Published : Jun 29, 2020, 2:48 PM IST

చైనా యాప్​ టిక్​టాక్​కు పోటీగా.. దేశీయంగా రూపొందించిన చింగారీ యాప్​కు మంచి ఆదరణ దక్కుతోంది. కేవలం పది రోజుల్లో ఈ యాప్​ను కొత్తగా 5 లక్షల 50 వేల మంది డౌన్​లోడ్​ చేసుకున్నారు. దీనితో మొత్తం డౌన్​లోడ్​ల సంఖ్య 25 లక్షలకు పెరిగింది.

Response rise for Chingari App
చింగారి యాప్​పై భారతీయుల మోజు

సామాజిక మాధ్యమాల్లో దేశీయ మొబైల్ యాప్​లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. సరిహద్దుల్లో చైనా-భారత్​ మధ్య వివాదం తర్వాత 'బాయ్​కాట్​ చైనా' ఉద్యమం ఊపందుకోవడం దేశీయ సామాజిక మాధ్యమ, చాటింగ్ యాప్​లకు కలిసొస్తోంది.

టిక్​టాక్​కు పోటీ..

చైనాకు చెందిన టిక్​టాక్ యాప్​కు దేశీయంగా ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యాప్​కు పోటీగా రూపొందించిన 'చింగారీ' ఇప్పుడు మంచి ఆదరణ పొందుతోంది.

తమ యాప్​ 25 లక్షల డౌన్​లోడ్​ల మైలురాయిని దాటినట్లు చింగారీ యాప్​ నిర్వాహకులు ప్రకటించారు. గడిచిన 10 రోజుల్లో 5 లక్షల 50 వేల మంది ఈ యాప్​ డౌన్​లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు ఓ సారి చేసిన ప్రకటనలో కేవలం మూడు రోజుల్లో 5 లక్షల మంది తమ యాప్​ డౌన్​లోడ్​ చేసుకున్నారని పేర్కొనడం గమనార్హం.

చింగారీ విశేషాలు..

టిక్​టాక్​లానే చింగారీ యాప్​లోనూ తక్కువ నిడివిగల వీడియోలు అప్​లోడ్ చేయొచ్చు. స్నేహితులతో చాటింగ్ చేసే సదుపాయం కూడా ఉంది.

ఈ యాప్​లో వీడియోలు అప్​లోడ్ చేయడం ద్వారా సామాజిక మధ్యమాల్లో ఆదరణ పొందడం సహా డబ్బులు సంపాదించొచ్చని యాప్​ నిర్వాహకులు చెబుతున్నారు. యూజర్లు అప్​లోడ్​ చేసిన వీడియో ఎంత వైరల్​గా మారింది, ఎంత మంది వీక్షించారు అనే అంశాల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తామని.. వీటితో డబ్బులు సంపాదించే వీలుందని తెలిపారు.

గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్​లలో ఈ యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన భాషల్లో ఈ యాప్​ అందుబాటులో ఉంది.

ఇదీ చూడండి:ఫేస్​బుక్​కు మరో షాక్​- స్టార్​బక్స్ యాడ్స్​ బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.