ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా ఇచ్చే సులభతర వాణిజ్య ర్యాంకింగ్స్‌లో ఈ ఏడాది భారత్ 14 స్థానాలు ఎగబాకి 63వ ర్యాంక్‌కు చేరింది. తాజా ర్యాంకింగ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జీఎస్టీని సరళీకృతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. దాని ద్వారా భారత్ ర్యాంకు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి రాష్ట్రాలు కూడా ప్రయత్నాలు చేయాల్సి ఉందన్నారు నిర్మల. ప్రత్యేకంగా ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంశంలో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఐబీసీ అమలుతో
దివాలా స్మృతి (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్-ఐబీసీ) అమలు కూడా భారత ర్యాంకును మెరుగుపరిచేందుకు ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు ఆర్థిక మంత్రి. వచ్చే ఏడాది ప్రపంచ బ్యాంకు... దేశంలో ప్రధాన నగరాలైన కోల్‌కతా, బెంగళూరులోని వ్యాపార వాతావరణాన్ని తన ర్యాంకింగ్‌లో పరిగణిస్తుందన్నారు. ప్రస్తుతం దిల్లీ, ముంబయిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటోంది ప్రపంచ బ్యాంకు.
ఇదీ చూడండి: టెల్కోలకు షాక్.. రూ.92 వేల కోట్ల ఫైన్ కట్టాల్సిందే!