ETV Bharat / business

సిరి: వ్యక్తిగత రుణం.. ఇవన్నీ తెలుసుకున్నాకే! - బ్యాంకులు/రుణ సంస్థలు క్రెడిట్‌ స్కోరు

డబ్బు.. కొన్నిసార్లు అత్యవసరంగా కావాల్సి వస్తుంది.. ఇలాంటప్పుడు మనకున్న ఏకైక మార్గం వ్యక్తిగత రుణం తీసుకోవడమే. వివాహం, విహార యాత్ర, వైద్య చికిత్స, ఏదైనా కొనాలనుకున్నా.. స్వల్పకాలిక అవసరాల కోసం దీన్ని మించిన ఉపాయం ఇంకోటి లేదు. అప్పు తీసుకునేప్పుడూ, దాన్ని తిరిగి చెల్లించే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అప్పుడే ఆ అప్పు మీకు భారం కాకుండా ఉంటుంది.

Siri: Personal loan ..  Knowing all this ..
సిరి:వ్యక్తిగత రుణం.. ఇవన్నీ తెలుసుకున్నాకే..
author img

By

Published : Feb 21, 2020, 10:07 AM IST

Updated : Mar 2, 2020, 1:12 AM IST

వ్యక్తిగత రుణం అంటే.. ఎలాంటి తనఖాలు, హామీలు లేకుండానే లభిస్తుంది. కాబట్టి, రుణ సంస్థ మీ గత రుణాలకు సంబంధించిన చెల్లింపులను పట్టిపట్టి చూస్తుంది. దీనికోసం చూసేది క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర నివేదిక. అందుకే, వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకునేప్పుడే.. ముందుగా మీ క్రెడిట్‌ స్కోరు ఎంతుందన్న సంగతిని తెలుసుకోండి. ఈ స్కోరు 750కి మించి ఉంటే.. ఈరుణంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలూ అందే అవకాశం ఉంటుంది. అధిక మొత్తంలో రుణం రావడంతోపాటు, వడ్డీ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. కొన్ని బ్యాంకులు/రుణ సంస్థలు క్రెడిట్‌ స్కోరు అనుకున్నంత లేనివారికీ అప్పులు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అయితే, రుణం చాలా తక్కువ మొత్తంలో రావడంతోపాటు, అధిక వడ్డీ కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు.. అధిక ఆదాయం ఉండటమే మార్గం. మంచి క్రెడిట్‌ స్కోరు ఉండి, మీతోపాటు సహదరఖాస్తుదారుడిగా ఉండేందుకు అర్హత ఉన్న వ్యక్తితో కలిసి దరఖాస్తు చేయొచ్చు.

ముందే మంజూరు చేస్తే..

కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల అర్హతలను బట్టి, వ్యక్తిగత, వాహన, గృహ రుణం ఇస్తామంటూ హామీ ఇస్తుంటాయి. ఎంత మొత్తం ఇచ్చేదీ చెబుతాయి. ఇలాంటి ఆఫర్లు ఎంతో శ్రమను తప్పిస్తాయి. అనేకానేక పత్రాలను సమర్పించాల్సిన అవసరమూ ఉండదు. సాధారణ రుణ దరఖాస్తులతో పోలిస్తే, ఇవి వేగంగా పరిష్కారం అవుతాయి. తొందరగా అప్పు చేతికి అందుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రుణం వచ్చేదీ లేనిదీ అంతిమంగా నిర్ణయించేది బ్యాంకు నియమనిబంధనలే. ముందస్తుగా అనుమతించే రుణ మొత్తం కేవలం మీ క్రెడిట్‌ స్కోరు ఆధారంగా పేర్కొంటారు. కొన్నిసార్లు క్రెడిట్‌ స్కోరులాంటివేమీ లేకున్నా ఈ ముందస్తు అనుమతి లభిస్తుంది. ఒకసారి రుణానికి దరఖాస్తు చేసుకున్నాకే అసలు విషయం తెలుస్తుంది.

వడ్డీ రేట్లు.. ఎక్కడ తక్కువ

హామీ ఉండే రుణాలతో పోల్చినప్పుడు.. ఎలాంటి హామీ లేని వ్యక్తిగత రుణాలకు వడ్డీ కాస్త అధికంగానే ఉంటుంది. కానీ, వీటి మంజూరులో బ్యాంకులు/రుణ సంస్థల మధ్య పోటీ అధికంగానే ఉంటుంది. అందుకే, ఈ రుణాలపై ఉన్న ఆఫర్లను మనం వదులుకోకూడదు. ఏ బ్యాంకు/రుణ సంస్థ ఎలాంటి ఆఫర్లను ప్రకటిస్తోంది వెతికి చూడాలి. కొన్ని సంస్థలు వడ్డీ రేటులో రాయితీ ఇస్తుంటాయి. మరికొన్ని ప్రాసెసింగ్‌ ఫీజుల్లాంటివి రద్దు అంటుంది.. వడ్డీ రేటు అరశాతం తగ్గినా కొంత ఊరటే కదా.. అప్పు అవసరం అయ్యిందని తొందర పడొద్దు.. కాస్త ఓపిక చేసుకొని, అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ విశ్లేషించుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. వడ్డీ రేటు, వ్యవధి ఆధారంగా ఈఎంఐ ఎంత ఉంటుందిలాంటి వాటిని తెలుసుకోవాలి. మీకు ఆర్థికంగా ఇబ్బంది కలగని మేరకు ఈఎంఐని నిర్ణయించుకొని, దానికి తగ్గట్టు వ్యవధిని ఎంచుకోవాలి.

అదనపు ఖర్చులు...

తక్కువ వడ్డీ రేట్ల కోసం వెతకడంతోపాటు.. చేయాల్సిన మరో పని.. రుసుముల భారం ఎంత ఉందో తెలుసుకోవడం. ప్రాసెసింగ్‌ ఫీజు, స్టేట్‌మెంట్‌ ఛార్జీ, వాయిదాలు సకాలంలో చెల్లించకపోతే అపరాధ రసుము, రుణాన్ని ముందే తీర్చేస్తే వర్తించే రుసుములాంటివన్నీ చూడాలి. ఈ అదనపు ఖర్చుల గురించి తెలుసుకోకుండా.. ముందుకెళ్తే.. అనవసర భారం మోయాల్సి వస్తుంది. సాధారణంగా ఒక ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే రుసుము కాస్త అధికంగానే ఉంటుంది. దీన్ని నివారించాలంటే.. వాయిదా తేదీనాడు బ్యాంకు ఖాతాలో సరిపోయేంత మొత్తం ఉండేలా చూసుకోవడమే. తక్కువ రుసుములు విధించే రుణ సంస్థను ఎంచుకోవడంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

నిబంధనల మాటేమిటి?

రుణ దరఖాస్తు పత్రంలో ఎన్నో నిబంధనలు ఉంటాయి. చిన్నచిన్న అక్షరాల్లో ఉండే వాటిని చదివి, అర్థం చేసుకోవడం అంత తేలికేమీ కాదు. కానీ, చదివినట్లూ, వాటిని అర్థం చేసుకున్నట్లు మనం సంతకం చేయాల్సి ఉంటుంది. చట్టపరంగా రుణ సంస్థలు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాయి. కానీ, మనమే అప్పు అవసరం ఉన్న తొందరలో కనీస నిబంధనలూ తెలుసుకోం. ఇది సరైన పద్ధతి కాదు.. సంతకం చేసేప్పుడు ప్రాథమికంగానైనా అక్కడ ఉన్న విషయం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రుసుముల విషయాన్ని ఒకటికి రెండుసార్లు చూసుకోండి.

- నవీన్‌ చందాని, చీఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌.

Last Updated : Mar 2, 2020, 1:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.