ETV Bharat / business

'ఓలా'కు పోటీగా 'సింపుల్​ వన్' ఈ స్కూటర్.. వచ్చేది అప్పుడే! - ఎలక్ట్రిక్ వాహనాలు

బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ 'సింపుల్​ ఎనర్జీ'.. ఈ స్కూటర్ల అమ్మకానికి సిద్ధమైంది. ఆగస్టు 15న మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. మరి ఈ - స్కూటర్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..?

Simple One
సింపుల్​ వన్
author img

By

Published : Aug 5, 2021, 7:58 PM IST

దేశవ్యాప్తంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు.. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నాయి. ప్రముఖ క్యాబ్​ సేవల సంస్థ ఓలా ఉత్పత్తి చేసిన ఈ స్కూటర్​లు ఆగస్టు 15 నుంచి మార్కెట్లోకి రానున్నాయి. ఈ క్రమంలో ఓలాకు పోటీగా.. బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ సింపుల్​ ఎనర్జీ.. 'సింపుల్​ వన్'​ అనే పేరుతో ఈ స్కూటర్ల అమ్మకానికి సిద్ధమైంది. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. ఆ రోజు నుంచే ఈ స్కూటర్ల కోసం బుకింగ్స్​ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అంతేకాక వచ్చే రెండేళ్లలో ఈ స్కూటర్​ల ఉత్పత్తిపై రూ.350కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించింది.

Simple One
సింపుల్​ వన్ ఈ స్కూటర్
Simple One
సింపుల్​ వన్ ఈ స్కూటర్

ఆ రాష్ట్రాల్లో..

కర్ణాటక, తమిళనాడు, దిల్లీ, గోవా, ఉత్తర్​ప్రదేశ్​లతో పాటు ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, మధ్యప్రదేశ్​, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్​, గుజరాత్, పంజాబ్​లో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది.

Simple One
సింపుల్​ వన్ ఈ స్కూటర్ వర్కింగ్ కండిషన్
Simple One
సింపుల్​ వన్ ఈ స్కూటర్ మోడల్

ఈ స్కూటర్​ల బుకింగ్​కు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక నగరాల నుంచి తమకు అభ్యర్థనలు వస్తున్నాయని, వీటిని పరిష్కరించాల్సి ఉందని సింపుల్ ఎనర్జీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్​కుమార్​ తెలిపారు.

ఈ- స్కూటర్ ప్రత్యేకతలివే..

  • బ్యాటరీ సామర్థ్యం.. 4.8 కేడబ్యూహెచ్​ లిథియమ్​- అయాన్ బ్యాటరీ
  • రేంజ్​(ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే).. 240 కిలోమీటర్లు
  • స్పీడ్​.. 100 కేఎమ్​పీహెచ్​
  • 0-50 కిలోమీటర్లు.. కేవలం 3.6 సెకండ్లలో
  • ధర.. రూ. 1.10 లక్షల నుంచి 1.20 లక్షలు

ఇవీ చదవండి:

ఓలా తొలి ఈ-స్కూటర్ విడుదల ఎప్పుడంటే..

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ బుకింగ్స్ షురూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.