అమెరికాకు చెందిన ఔషధ తయారీ సంస్థ నొవావ్యాక్స్ అభివృద్ధి చేసిన 'కొవావ్యాక్స్' టీకాను భారత్లో ఉత్పత్తి చేయడం ప్రారంభించినట్లు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. పుణె కేంద్రంలో టీకా ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు.
"నొవావ్యాక్స్ సంస్థ టీకాను స్వదేశంలో ఉత్పత్తి చేయడం ఆనందంగా ఉంది. 18 ఏళ్ల లోపు వారికి కూడా ఈ టీకా బాగా ఉపయోగపడుతుంది. ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయి. సీరం బృందానికి అభినందనలు."
--అదర్ పూనావాలా, సీరం సంస్థ సీఈఓ.
తొలుత.. ఈ ఏడాది మార్చ్ నెలలో కొవావ్యాక్స్ టీకా క్లినికల్ ట్రయల్స్ భారత్లో ప్రారంభమైనట్లు పునావాలా తెలిపారు. సెప్టెంబర్ కల్లా టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో సీరం సంస్థ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాలను భారత్లో ఉత్పత్తి చేసింది.
ఇదీ చదవండి:సెప్టెంబరు కల్లా కొవావ్యాక్స్ టీకా!