ఫ్లిప్‌కార్ట్, పతంజలి పేయా కార్యకలాపాలను ఎందుకు నిలిపివేయకూడదో చెప్పాలంటూ ఆ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ). ఈ విషయాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదించింది. సదరు సంస్థలు సీపీసీబీ వద్ద రిజిస్టర్ కాలేదని పేర్కొంది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ-2018 చట్టం నిబంధనలు పాటించనందుకు పర్యావరణ చట్టం సెక్షన్ 5 ప్రకారం అక్టోబర్ 8న ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది సీపీసీబీ. అయితే.. షోకాజ్ నోటీసులపై ఆయా సంస్థలు స్పందించలేదని తెలిపింది.
హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, పెప్సికో ఇండియా హోల్డింగ్ ప్రై.లి., బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రై. లి., నౌరిష్కో బేవరేజెస్ లిమిటెడ్ సంస్థలు సీపీసీబీ వద్ద రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ(ఈపీఆర్) అమలు కోసం ఎలాంటి ప్రణాళికలను ఈ సంస్థలు అందించలేదని స్పష్టం చేసింది.
ఈ సంస్థలు పంపించిన పత్రాలను రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు ఆమోదించలేదని సీపీసీబీ వెల్లడించింది. దీనికి అనుగుణంగా ఆయా సంస్థలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.
ఇదీ చదవండి- ఎస్బీఐ సేవలకు అంతరాయం.. కారణమిదే