ఉత్పత్తి తగ్గింపు కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. భారత్‌లో పెట్రోల్ ధరలు సోమవారం తగ్గముఖం పట్టాయి. పెట్రోల్‌పై 22-23 పైసలు, డీజిల్‌పై 20-21 పైసలు తగ్గాయి.
![crude](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6265534_english.jpg)
కరోనా వైరస్ కారణంగా..
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 1.8 శాతం పెరిగి రూ.51.41 డాలర్లకు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తితో డిమాండ్ తగ్గిన కారణంగా ఉత్పత్తిని తగ్గిస్తోంది సౌదీ అరేబియా. రోజుకు 10లక్షల బ్యారెళ్లకు కోత పెడుతోంది.
80 శాతం దిగుమతులే..
దేశంలో ఇంధన ధరలు అంతర్జాతీయ క్రూడ్ ధరలతో పాటు రూపాయి మారకంపై ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే భారత్ 80 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది.
దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు రోజువారీగా నిర్ణయిస్తాయి.