భారత్లో 'స్పుత్నిక్-వీ' కొవిడ్ టీకాను పరీక్షలు, విశ్లేషణ కోసం ఉత్పత్తి చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కి భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) కొన్ని షరతులతో అనుమతించినట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ మేరకు డీసీజీఐ నాలుగు షరతులను విధించినట్లు వెల్లడించాయి.
మాస్కో(రష్యా)కు చెందిన ' గమాలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ' సహకారంతో (కొలాబరేషన్).. పుణె సమీపంలోని తమ హదాప్సర్ యూనిట్లో ఈ టీకాను అభివృద్ధి చేయాలని ఎస్ఐఐ యోచిస్తోంది. ఈ విషయమై సీరమ్ ఇన్స్టిట్యూట్ గురువారం డీసీజీఐకు దరఖాస్తు చేసింది.
ఇదీ చదవండి : 'దేశంలో 68శాతం కేసులు తగ్గాయ్'