స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, విదేశీ నిధుల ఉపసంహరణ కారణంగా బ్యాంకింగ్, ఐటీ, వాహన రంగాలు నష్టాలు చవిచూస్తున్నాయి. శుక్రవారం, సోమవారం నమోదైన భారీ లాభాలను సొమ్ము చేసుకునేందుకు మదుపరులు మొగ్గు చూపడమూ మరో కారణంగా కనిపిస్తోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 279 పాయింట్లు కోల్పోయి 38 వేల 817 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 11 వేల 506 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో
పవర్‌గ్రిడ్ కార్ప్, జీ ఎంటర్టైన్మెంట్, టైటాన్ కంపెనీ, రిలయన్స్, ఎన్టీపీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ రాణిస్తున్నాయి.
నష్టాల్లో
టాటా మోటార్స్, ఎస్బీఐ, హిందాల్కో, వేదాంత, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్‌సెంగ్, కోస్పీ, షాంఘై కాంపోజిట్ సైతం నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి విలువ
ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ తగ్గి 7 పైసలు తగ్గి.. ఒక డాలరుకు రూ.71.08 గా కొనసాగుతోంది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.71 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 62.65 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: రైతుల కోసం ప్రత్యేక యాప్ ఆవిష్కరించిన కేంద్రం