ETV Bharat / business

మార్కెట్లు మళ్లీ ఢమాల్- సెన్సెక్స్ 811 పాయింట్లు పతనం

స్టాక్​ మార్కెట్లు మళ్లీ భారీ నష్టాలతో ముగిశాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత వృద్ధి రేటును తగ్గిస్తూ మూడీస్ చేసిన ప్రకటన సహా.. దేశంలో కొవిడ్​ కేసులు వేగంగా పెరుగుతుండటం మార్కెట్ల నష్టాలకు ప్రధాన కారణం. సెన్సెక్స్​ 811 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 229 పాయింట్లు క్షీణించింది.

STOCKS MARKETS AGAIN FALL
స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు
author img

By

Published : Mar 17, 2020, 3:58 PM IST

Updated : Mar 17, 2020, 8:06 PM IST

కరోనా భయాలు స్టాక్ మార్కెట్లను కుదిపేస్తూనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఆర్బీఐ ఇచ్చిన భరోసాతో ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు మిడ్ సెషన్ వరకు అవే లాభాలను కొనసాగించాయి. అయితే కొవిడ్​ నేపథ్యంలో భారత వృద్ధి రేటును తగ్గిస్తూ మూడీస్ చేసిన ప్రకటన మదుపరుల సెంటిమెంట్​పై ప్రతికూల ప్రభావం చూపింది. వీటికి తోడు భారత సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు, మరణాలు వేగంగా పెరుగుతుండటం కారణంగా ఆరంభ లాభాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు మదుపరులు.

సెషన్​ ముగిసే సమయానికి బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 811 పాయింట్లు కోల్పోయి 30,579కి దిగజారింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 230 పాయింట్ల నష్టంతో 8,967కి చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 32,048 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 30,395 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ నేడు 9,404 పాయింట్ల అత్యధిక స్థాయి, 8,916 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

ఇదీ చూడండి:2020లో భారత వృద్ధి రేటు 5.3 శాతమే!

Last Updated : Mar 17, 2020, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.