ETV Bharat / business

ఎఫ్​ అండ్​ ఓ గడువు ముగిసింది.. మార్కెట్​ నష్టపోయింది - expiry of December derivatives contracts

దేశీయ, ప్రపంచ మార్కెట్లలో సంవత్సరాంత సెలవులు కొనసాగుతుండటం, డిసెంబర్​ డెరివేటివ్స్​ గడువు ముగియడం స్టాక్​మార్కెట్లపై ప్రభావం చూపింది. ఫలితంగా బీఎస్​ఈ సెన్సెక్స్ 297 పాయింట్లు కోల్పోయి 41వేల 163 వద్ద ముగియగా, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 12వేల 126 వద్ద స్థిరపడింది.

Sensex tanks 297 pts on F&O expiry
నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Dec 26, 2019, 4:26 PM IST

డిసెంబర్​ డెరివేటివ్స్ గడువు ముగియడం, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుల నష్టాల ప్రభావం స్టాక్​మార్కెట్లపై పడింది. దేశీయ, ప్రపంచ మార్కెట్లలో సంవత్సరాంత సెలవులు ఉండటం వల్ల స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 297 పాయింట్లు కోల్పోయి 41 వేల 163 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 12 వేల 126 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో

వేదాంత, ఓఎన్​జీసీ, బజాజ్​ ఫైనాన్స్​, టాటా స్టీల్, ఎన్​టీపీసీ, ఎమ్​ అండ్​ ఎమ్ 1.63 శాతం మేర రాణించాయి.

భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్, ఎస్​ బ్యాంకు, ఐఓసీ, సన్​ఫార్మా, లార్సెన్ అండ్​ టుబ్రో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, మారుతీ, టైటాన్​, కోటక్​ బ్యాంకు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

నిక్కీ, కోస్పీ, షాంఘై కాంపోజిట్, టోక్యో, సియోల్​ మార్కెట్లు లాభాలు మూటగట్టుకోగా.. హాంగ్​సెంగ్ నష్టాలు చవిచూసింది.

రూపాయి విలువ

రూపాయి విలువ ఒక డాలరుకు రూ.71.27లుగా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.33 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 67.42 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: ఇకపై బీమ్, యూపీఐతోనూ ఫాస్టాగ్​ల రీఛార్జ్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.