ETV Bharat / business

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాటలో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ 60 పాయింట్లకు పైగా వృద్ధితో ట్రేడవుతోంది.

stock market news
స్టాక్ మర్కెట్ వార్తలు
author img

By

Published : Mar 25, 2020, 10:51 AM IST

స్టాక్ మార్కెట్లలో నేడు ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. ప్రారంభంలో కాస్త సానుకూలంగా స్పందించిన సూచీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చాయి.

కారణం..

కరోనా నేపథ్యంలో ఆర్థిక ఉద్దీపనలు ఉంటాయని కేంద్రం ఇచ్చిన హామీతో ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మదుపరుల్లో మళ్లీ భయాలు పెంచింది. ఈ నేపథ్యంలో లాభనష్టాల మధ్య ఊగిసలాటలో కొనసాగుతున్నాయి సూచీలు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 130 పాయింట్లకుపైగా వృద్ధితో 26,807 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల వృద్ధితో.. 7,860 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివి ఇవే..

రిలయన్స్, నెస్లే, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు సానుకూలంగా కొనసాగుతున్నాయి.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఎం&ఎం, ఐటీసీ, హీరో మోటోకార్ప్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు నష్టాల్లు ఉన్నాయి.

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు హాంకాంగ్, షాంఘై, సియోల్‌, టోక్యో సూచీలు 5 శాతం మేర లాభాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:కరోనాతో మలేరియా మందుకు గిరాకీ.. అమెరికా నుంచి ఆర్డర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.