ETV Bharat / business

టెలికాం, ఐటీ షేర్లు డీలా.. నష్టాలతో ముగిసిన సూచీలు - స్టాక్ మార్కెట్ వార్తలు

స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. మంగళవారం సెన్సెక్స్ 63 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 10 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది.

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : May 26, 2020, 4:01 PM IST

స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బొంబయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 63 పాయింట్లు కోల్పోయి 30,609 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప నష్టంతో 9,029 వద్దకు చేరింది.

కారణాలు..

భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో పెరుగుతున్న కరోనా కేసులు, అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టెలికాం, ఐటీ షేర్లు మంగళవారం ప్రధానంగా నష్టాల్లో ముగిశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 31,086 పాయింట్ల అత్యధిక స్థాయి, 30,512 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 9,162 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 8,997 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టైటాన్​, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్​ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఐటీసీ, ఎన్​టీపీసీ షేర్లు లాభపడ్డాయి.

భారతీయ ఎయిర్​టెక్, టీసీఎస్​, బజాజ్​ ఫినాన్స్​, సన్​ ఫార్మా, టెక్​ మహీంద్రా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్లో రూపాయి మంగళవారం 26 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 75.66 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:'ఇంటి నుంచి పని'తో ఆఫీస్​ స్థలం డిమాండ్​లో క్షీణత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.