స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ సానుకూలతల నడుమ.. దేశీయ సూచీలూ సానుకూలంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్తు రంగం మినహా.. లోహం, ఐటీ, ఇన్ఫ్రా, బ్యాంకింగ్ రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 245 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 41 వేల 184 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 63 పాయింట్లు వృద్ధి చెంది.. 12 వేల 116 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లోనివివే...
వేదాంత, ఎస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, సిప్లా, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా ఉత్తమ లాభాల్లో కొనసాగుతున్నాయి.
గెయిల్, యూపీఎల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఐఓసీ, హెచ్‌డీసీ, నెస్లే, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ ఆరంభ ట్రేడింగ్‌లోనే డీలాపడ్డాయి.
రూపాయి..
ఆరంభ ట్రేడింగ్‌లో రూపాయి స్వల్పంగా 4 పైసలు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 70.96 వద్ద ఉంది.