ETV Bharat / business

ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలతో లాభాలు

దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, వాహన రంగాలు రాణించాయి. ఆర్​బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందనే అంచనాలు, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ పారిశ్రామికవేత్తలతో సమావేశం కాబోతున్న నేపథ్యంలో మార్కెట్​ సెంటిమెంటు బలపడడమే ఇందుకు కారణం.

ఆర్​బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు ఆశలతో లాభాలు
author img

By

Published : Aug 6, 2019, 4:51 PM IST

బ్యాంకింగ్​, వాహన రంగాలు రాణించడం, ఆర్​బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందనే అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ​ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 277 పాయింట్లు లాభపడి 36 వేల 976 వద్ద ముగిసింది. నేషనల్​ స్టాక్​ ఎక్స్ఛేంజ్​ సూచీ నిఫ్టీ 85.65 పాయింట్లు వృద్ధి చెంది 10 వేల 948 వద్ద స్థిరపడింది.

లాభాల్లో...

ఎస్​ బ్యాంకు, బజాజ్​ ఫైనాన్స్​, టెక్​ మహీంద్ర, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్​టెల్​, హీరో మోటోకార్ప్​, ఏషియన్ పెయింట్స్​ (5.30 శాతం వరకు) రాణించాయి.

నష్టాల్లో...

జీ ఎంటర్​టైన్మెంట్​, సిప్లా, పవర్​గ్రిడ్​ కార్ప్, టీసీఎస్​, ఆర్​ఐఎల్, వేదాంత, ఇన్ఫోసిస్​, ఐటీసీ, రిలయన్స్​, టాటా మోటార్స్, బజాజ్​ ఆటో (1.52 శాతం) నష్టపోయాయి.

ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ నేతృత్వంలో ద్రవ్య పరపతి సమీక్ష జరుగుతోంది. మందగించిన ఆర్థిక వ్యవస్థను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఆర్​బీఐ కీలక వడ్డీరేట్లు (రెపో రేటు, రివర్స్​ రెపోరేటు, సీఆర్​ఆర్​) తగ్గించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ పరిశ్రమల అధినేతలతో సమావేశమవుతానని ప్రకటించడం కూడా మార్కెట్​ సెంటిమెంటుకు బలం చేకూర్చింది.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు షాంగై కాంపోజిట్​, హాంగ్​సెంగ్​, నిక్కీ, కోస్పీ నష్టాలతో ముగిశాయి. యూరోప్​ స్టాక్​మార్కెట్లు మాత్రం ప్రారంభ ట్రేడింగ్​లో లాభాలతో కొనసాగుతున్నాయి.

రూపాయి

రూపాయి విలువ 7 పైసలు క్షీణించి, ఒక డాలరుకు రూ.70.80 గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.48 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్​ ధర 60.10 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: దసరా తర్వాత కశ్మీర్‌కు పెట్టుబడుల వరద!

AP Video Delivery Log - 0900 GMT Horizons
Tuesday, 6 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1639: HZ Germany BBQ Competition No Access Germany 4223763
What's cooking? Chefs battle it out at BBQ championship
AP-APTN-1538: HZ Germany Hologram Circus AP Clients Only 4223715
The Big Top goes high tech with holograms
AP-APTN-1526: HZ Russia History in Action AP Clients Only 4223737
Sword fights and gunfire - reliving centuries' old warfare
AP-APTN-1445: HZ Russia Stalin's Victims AP Clients Only 4223181
Descendants of Stalin's victims set historical record straight ++UPDATED TRANSLATIONS++
AP-APTN-1436: HZ Poland Sunflowers AP Clients Only/No access Poland 4223729
Urban glory - Sunflowers bloom in the city
AP-APTN-1325: HZ Russia Barge Hauling Festival AP Clients Only 4223721
Annual traditional barge pulling festival
AP-APTN-1248: HZ Russia Soviet Exhibition AP Clients Only 4223338
80th anniversary of Moscow’s famous exhibition venue ++CORRECTED SCRIPT++
AP-APTN-1050: HZ Japan Flying Car AP Clients Only 4223692
Flying electric car prototype tested in Japan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.