స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 50,297 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 157 పాయింట్లు బలపడి 14,919 వద్దకు చేరింది.
ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయాలు సానుకూలంగా నమోదవటం వృద్ధి రేటుపై ఆశలు పెంచాయి. దీనితో వాహన, ఐటీ రంగాల్లో భారీగా కొనుగోళ్లు నమోదయ్యాయి. దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందించడం లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,439 అత్యధిక స్థాయిని; 49,807 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 14,933 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,760 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎం&ఎం, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో నష్టపోయాయి.
ఇదీ చదవండి:బిలియనీర్ల క్లబ్‌లోకి మరో 40 మంది భారతీయులు