ETV Bharat / business

బడ్జెట్​కు ముందు భారీ నష్టాలు- సెన్సెక్స్ 588 డౌన్ - షేర్ మార్కెర్​ అప్​డేట్స్

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన వాతాంతపు సెషన్​ను చివరకు భారీ నష్టాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 588 పాయింట్లు తగ్గి.. 46,300 దిగువకు చేరింది. నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో.. 13,700 మార్క్ కోల్పోయింది.

stocks close with huge losses
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jan 29, 2021, 3:42 PM IST

స్టాక్​ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ భారీ నష్టాలతో ముగిశాయి. వారంలో చివరి రోజు సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 588 పాయింట్లు తగ్గి 46,285 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 13,634 వద్ద స్థిరపడింది.

చివరి గంటలో ఐటీ, ఆటో, లోహ రంగాల్లో భారీగా నమోదైన అమ్మకాలు నష్టాలకు ప్రధాన కారణమంటున్నారు విశ్లేషకులు. దేశ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం క్షీణించొచ్చని ఆర్థిక సర్వే 2020-21 అంచనా వేయడం, అంతర్జాతీయ మార్కెట్లూ ప్రతికూలంగా స్పందిస్తుండటం కూడా నష్టాలకు కారణమైనట్లు తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 47,423 పాయింట్ల అత్యధిక స్థాయి, 46,160 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 13,966 పాయింట్ల గరిష్ఠ స్థాయి 13,596 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాలను నమోదు చేశాయి.

డాక్టర్​ రెడ్డీస్, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్​టెల్, ఎన్​టీపీసీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన.. షాంఘై, టోక్యో సియోల్, హాంకాంగ్ సూచీలూ శుక్రవారం భారీ​​ నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి:2020-21లో వృద్ధి రేటు -7.7%: ఆర్థిక సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.