స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 561 పాయింట్లు కోల్పోయి.. 34,869 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 10,305 వద్దకు చేరింది.
ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. వీటికి తోడు దేశ ఆర్థిక వ్యవస్థపై రేటింగ్ ఏజెన్సీలు ప్రతికూల అంచనాలు విడుదల చేస్తుండటం ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 35,706 పాయింట్ల అత్యధిక స్థాయి, 34,794 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,553 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,282 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, నెస్లే, రిలయన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్‌లు లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ ఆరు కంపెనీలే లాభపడ్డాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌బీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి గురువారం 6 పైసలు తగ్గింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.75.72 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి:భారత సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి!