స్టాక్ మార్కెట్లకు ఇవాళ మిశ్రమ ఫలితాలొచ్చాయి. ఆరంభ ట్రేడింగ్‌లో జోరు చూపించిన సూచీలు అనంతరం.. తీవ్ర ఒడుదొడుకులతో నష్టాల బాట పట్టాయి. చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 8 పాయింట్ల లాభం, జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 8 పాయింట్ల నష్టాన్ని నమోదు చేశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్లు పెరిగి 40 వేల 802 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి.. 12 వేల 48 వద్ద ముగిసింది.
ఆటో, ప్రైవేటు బ్యాంకింగ్ రంగాల షేర్లు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
లాభనష్టాల్లో...
సెన్సెక్స్ ప్యాక్‌లో భారతీ ఎయిర్టెల్ అత్యుత్తమ లాభాలు ఆర్జించింది. రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 4.17 శాతం పుంజుకున్నాయి.
ఎస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, మారుతీ షేర్లు 6.22 శాతం డీలా పడ్డాయి.
ఇదీ చూడండి: 40వేల కోట్ల 'మహా' డ్రామాపై రాజకీయ దుమారం