ETV Bharat / business

నాలుగో రోజూ బుల్ జోరు- సెన్సెక్స్ 601+

వరుసగా నాలుగో రోజూ స్టాక్ మార్కెట్లలో బుల్​ జోరు కొనసాగింది. మంగళవారం సెషన్​లో సెన్సెక్స్ 601 పాయింట్లు బలపడి 39,600 మార్క్​కు చేరువైంది. నిఫ్టీ 159 పాయింట్లు పుంజుకుంది. 30 షేర్ల ఇండెక్స్​లో హెచ్​డీఎఫ్​సీ అత్యధిక లాభాలను గడించింది.

Share Market news Telugu
స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు
author img

By

Published : Oct 6, 2020, 3:45 PM IST

Updated : Oct 6, 2020, 5:07 PM IST

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 601 పాయింట్లు పుంజుకుని.. 39,574 వద్దకు చేరింది. ఎన్​​ఎస్​ఈ-నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 11,662 వద్ద స్థిరపడింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడం అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచింది. ఫలితంగా విదేశీ మార్కెట్లు పుంజుకోవడం.. దేశీయ సూచీలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్​లో వ్యాపార కార్యకలాపాలు మెరుగైనట్లు నివేదికలు వస్తుండటం కూడా మంగళవారం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

Markets today
నేటి మార్కెట్ల ట్రేడింగ్ ఇలా

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 39,624 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,191 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,680 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,564 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​డీఎఫ్​సీ అత్యధికంగా 8 శాతానికిపైగా లాభపడింది. ఎం&ఎం, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

టాటా స్టీల్, నెస్లే, ఎల్​&టీ, సన్​ ఫార్మా షేర్లు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలూ మంగళవారం లాభాలను గడించాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి మంగళవారం 17 పైసలు తగ్గింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.46 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.51 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 41.50 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:వడ్డీ రేట్లపై సమీక్షకు కొత్త తేదీలు ఖరారు

Last Updated : Oct 6, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.