ETV Bharat / business

వారాంతంలో అమ్మకాలు- సెన్సెక్స్​ 634 పాయింట్లు పతనం - నిప్టీ

స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 634 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 194 పాయింట్ల నష్టంతో 11,400 దిగువకు చేరింది. అంతర్జాతీయ ప్రతికూలతలు శుక్రవారం నష్టాలకు కారణమయ్యాయి.

stock markets news Telugu
స్టాక్ మర్కెట్ వార్తలు తెలుగు
author img

By

Published : Sep 4, 2020, 3:49 PM IST

Updated : Sep 4, 2020, 5:08 PM IST

స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 634 పాయింట్లు తగ్గి 38,357 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 194 పాయింట్ల నష్టంతో 11,334 వద్దకు చేరింది.

అమెరికా సహా ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపరులు అమ్మకాలపై దృష్టిసారించడం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

దాదాపు అన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొనగా.. బ్యాంకింగ్ షేర్లు అత్యధిక నష్టాలను మూటగట్టుకున్నాయి.

Markets on Friday
శుక్రవారం ట్రేడింగ్ ఇలా

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 38,729 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,249 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,452 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,303 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

30 షేర్ల ఇండెక్స్​లో మారుతీ మాత్రమే లాభపడింది.

యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ, సన్​ఫార్మా షేర్లు భారీగా నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్​ సూచీలు శుక్రవారం నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి శుక్రవారం 33 పైసలు పుంజుకుంది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.73.14 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.52 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 44.30 డాలర్లుగా ఉంది.

మార్కెట్లో నేడు

ఇదీ చూడండి:ప్లే స్టోర్​, యాప్ స్టోర్​ నుంచి పబ్​జీ తొలగింపు

Last Updated : Sep 4, 2020, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.