ETV Bharat / business

నష్టాలకు బ్రేక్​- ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు మంగళవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్​ అతిస్వల్పంగా 7 పాయింట్లు పెరిగి ఫ్లాట్​గా స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు పుంజుకుంది. ఐటీ షేర్లు రాణించాయి. ఆర్థిక షేర్లు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

Stock market news Telegu
స్టాక్​ మార్కెట్లకు స్వల్ప లాభాలు
author img

By

Published : Feb 23, 2021, 3:45 PM IST

స్టాక్ మార్కెట్లలో ఐదు రోజుల తర్వాత బేర్​ దూకుడుకు అడ్డుకట్ట పడింది. మంగళవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్​ అతి స్వల్పంగా 7 పాయింట్లు బలపడి 49,751 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 14,707వద్దకు చేరింది.

మిడ్ సెషన్​లో భారీగా లాభాలు నమోదైనా.. చివరి గంటలో మదుపరులు అమ్మకాలపై దృష్టి సారించడం వల్ల సూచీలు ఫ్లాట్​గా స్థిరపడినట్లు తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,327 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,659 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,854 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,651 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఓఎన్​జీసీ, ఎల్​&టీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, ఎస్​బీఐ షేర్లు లాభాలను గడించాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ, బజాజ్ ఆటో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో హాంకాంగ్ సూచీ మాత్రమే లాభాలను గడించింది. షాంఘై, సియోల్​ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. టోక్యో మార్కెట్​కు సెలవు.

ఇదీ చదవండి:స్వతంత్ర సంస్థగా రిలయన్స్ ఓ2సీ విభాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.