ETV Bharat / business

ట్రంప్ సంతకంతో స్టాక్ మార్కెట్ల రికార్డులు - షేర్ మార్కెట్ వార్తలు

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 47,350 మార్క్ దాటింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన 13,850పైకి చేరింది. 30 షేర్ల ఇండెక్స్​లో ఎస్​బీఐ అత్యధిక లాభాన్ని గడించింది.

stocks close at new record level
స్టాక్ మార్కెట్ల కొత్త రికార్డులు
author img

By

Published : Dec 28, 2020, 3:46 PM IST

స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. సోమవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 380 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 47,354 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన 13,873 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందించాయి. బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, టెక్ కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 900 బిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీపై సంతకం చేయడం అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచింది. ఈ ప్రభావంతో మార్కెట్లు దూసుకెళ్లినట్లు విశ్లేషకుల చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 47,406 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 47,148 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 13,885 పాయింట్ల గరిష్ఠ స్థాయి(జీవనకాల గరిష్ఠం), 13,811 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎస్​బీఐ, టైటాన్, ఎల్​&టీ, ఇండస్​ఇండ్ బ్యంక్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాలను గడించాయి.

హెచ్​యూఎల్​, సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్, బజాజ్ ఫిన్​సర్వ్ నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోల్ సూచీలు సోమవారం లాభపడ్డాయి. హాంకాంగ్ సూచీ స్వల్ప నష్టాన్ని నమోదు చేసింది.

ఇదీ చూడండి:టీసీఎస్​ రికార్డ్- ఎంక్యాప్ @ రూ.11లక్షల కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.