ETV Bharat / business

మళ్లీ కరోనా భయాలు.. రెండో రోజూ నష్టాలు - సెన్సెక్స్

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. గురువారం సెషన్​లో సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 16 పాయింట్లు తగ్గింది. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు ప్రధాన కారణం.

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 25, 2020, 3:47 PM IST

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. గురువారం సెషన్​లో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 27 పాయింట్లు కోల్పోయి.. 34,842 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 10,289 వద్దకు చేరింది.

మిడ్ సెషన్​​ ముందు కాస్త సానుకూలంగా స్పందించి.. లాభాలు నమోదు చేసిన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి గంటలో బ్యాంక్ షేర్లు పుంజుకోవడం వల్ల స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం కారణంగా మదుపరులు అమ్మకాలపై దృష్టి సారిస్తున్నారు. వీటికి తోడు విదేశీ మార్కెట్లు కూడా ప్రతికూలంగా స్పందించడం దేశీయ సూచీలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 35,082 పాయింట్ల అత్యధిక స్థాయి, 34,500 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 10,362 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,194 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఐటీసీ, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, హెచ్​యూఎల్, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలను గడించాయి.

ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్​టెక్, ఎం&ఎం, ఎన్​టీపీసీ, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్లో రూపాయి కాస్త పుంజుకుంది. గురువారం సెషన్​లో 7 పైసలు పెరిగి.. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.75.65 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:తస్మాత్ జాగ్రత్త: ఆన్​లైన్ పేమెంట్​ చేస్తే ఇక అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.