బ్యాంకింగ్, ఆటో రంగాల్లో నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఆరంభంలో 400కుపైగా పాయింట్లు కోల్పోయింది. కొవిడ్-19 మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపనుందన్న అనిశ్చితి నేపథ్యంలో మదుపరుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భయాలు వెంటాడుతున్నాయి.
ప్రస్తుతం 225 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 28 వేల 40 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 8 వేల178 వద్ద కొనసాగుతోంది.
ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం భారీ నష్టాలను మూటగట్టుకుంది. సెన్సెక్స్ ప్యాక్‌లో కోటక్ బ్యాంకు 7 శాతానికి పైగా నష్టపోయింది. ఇండస్ఇండ్ బ్యాంక్, హీరోమోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంకు నష్టాలోనే ఉన్నాయి.
సిప్లా, బజాజ్ ఫినాన్స్, గెయిల్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా రంగాలు రాణిస్తున్నాయి.
బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, టైటాన్ కంపెనీ డీలాపడ్డాయి.
రూపాయి..
ఆరంభ ట్రేడింగ్‌లో రూపాయి భారీగా క్షీణించింది. 48 పైసలు కోల్పోయి... ప్రస్తుతం 76.08 వద్ద ఉంది.