ETV Bharat / business

వెల్లువెత్తిన అమ్మకాలు.. సెన్సెక్స్ 242 పాయింట్లు పతనం

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో నేడు నష్టాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 242 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయింది.

stocks closing
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : May 7, 2020, 3:51 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 242 పాయింట్లు బలపడి 31,443 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 9,199 వద్దకు చేరింది.

ఇంధన, విద్యుత్​, టెలికాం, ఆటో, బ్యాకింగ్ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాలు నేటి నష్టాలకు కారణమయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 31,705 పాయింట్ల అత్యధిక స్థాయి, 31,365 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 9,278 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 9,175 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎం&ఎం, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్​ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.

ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, టైటాన్​, పవర్​గ్రిడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సాధించిన వృద్ధితో.. ఎస్​ బ్యాంక్ షేర్లు నేడు 6 శాతానికి పైగా బలపడ్డాయి.

ఇదీ చూడండి:బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించాలా వద్దా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.