Bharat NCAP Crash Test: సేఫ్టీ విషయంలో స్వదేశీ SUV తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా పెట్టింది పేరు. తాజాగా ఈ కంపెనీకి చెందిన మూడు వాహనాలు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించాయి. దీంతో ప్రయాణికుల సేఫ్టీ విషయంలో మహీంద్రా కార్లు బెస్ట్ అని కంపెనీ మరోసారి నిరూపించుకుంది.
5 స్టార్ రేటింగ్ పొందిన మహీంద్రా కార్లు ఇవే:
- మహీంద్రా థార్ రాక్స్
- XUV400 EV
- మహీంద్రా 3XO
1. మహీంద్రా థార్ రాక్స్ సేఫ్టీ రేటింగ్: భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో కంపెనీకి చెందిన ప్రముఖ మహీంద్రా థార్ రాక్స్ 5-స్టార్ రేటింగ్‌ను అందుకుంది. ఈ రేటింగ్ SUV అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్స్ పొందిన ఫస్ట్ బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్యాసింజర్ వాహనం ఇదే. అయితే మహీంద్రా థార్ రాక్స్ అడల్ట్ ప్యాసింజర్ సేఫ్టీ విషయంలో అత్యధిక స్కోర్ సాధించడంలో స్వల్పంగా విఫలమైంది.
- అడల్ట్ సేఫ్టీ రేటింగ్: మహీంద్రా థార్ రాక్స్ మొత్తం పెద్దల భద్రతకు సంబంధించి మొత్తం 32 పాయింట్లకు గానూ 31.09 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్‌లో.. ఈ కారులో డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్‌కు అందించిన హెడ్ అండ్ నెక్ ప్రొటక్షన్ బాగుంది. డ్రైవర్ ఛాతీ సేఫ్టీ పర్లేదు. ఫ్రంట్ ప్యాసింజర్ల ఛాతీ రక్షణ బాగుంది. ఇక ఈ ఎస్‌యూవీలో డ్రైవర్, ప్రయాణికుల మోకాలి ప్రొటెక్షన్ మంచిగానే ఉంది.
- చైల్డ్ ప్రొటెక్షన్ రేటింగ్: పిల్లల భద్రత పరంగా థార్ రాక్స్ 49 పాయింట్లలో 45 స్కోర్ చేసింది. ఈ కారణంగానే దీనికి 5-స్టార్ రేటింగ్ ఇచ్చారు. క్రాష్ టెస్ట్‌లో.. ISOFIX ఎంకరేజ్‌లను ఉపయోగించి వెనుక భాగంలో ఇన్‌స్టాల్ చేసిన 3 ఏళ్ల డమ్మీ చైల్డ్ సీటు.. ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో అధిక ఫార్వర్డ్ మూవ్‌మెంట్‌ను నివారించడంలో విజయవంతమైంది. ఈ కారులో సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో మంచి రక్షణను అందించారు.
2. మహీంద్రా 3XO సేఫ్టీ రేటింగ్: ఈ కాంపాక్ట్ SUV కూడా పెద్దలు, పిల్లల భద్రత విషయంలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. క్రాష్ టెస్ట్ 5స్టార్ రేటింగ్ సాధించిన తాజా మోడల్‌గా ఇది నిలిచింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ క్రాష్ టెస్ట్‌లో అడల్ట్ సేఫ్టీ విషయంలో 3XO మొత్తం 32కి 29.36 స్కోర్‌ను అందుకుంది. 3XO ఫ్రంట్ ఆఫ్‌సెట్ బారియర్ క్రాష్ టెస్ట్‌లో ఫ్రంట్ ప్యాసింజర్‌కు అన్ని సైడ్స్ నుంచి మంచి రక్షణను అందించింది.
- అడల్ట్ సేఫ్టీ రేటింగ్: డ్రైవర్ ఛాతీ, కాళ్లు, పాదాల రక్షణ విషయంలో తక్కువ స్కోర్ సాధించింది. అయితే ఇందులో డ్రైవర్ హెడ్, హిప్ అండ్ థై ప్రొటెక్షన్ బాగుంది. మరోవైపు ఈ SUV సైడ్ బారియర్, పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో 16కు 16 పాయింట్లను పొందింది. ఈ కారు ఫ్రంట్ సీట్లో ఉన్నవారికి రెండు పారామీటర్లలో మంచి ప్రొటెక్షన్‌ను అందిస్తుంది.
- చైల్డ్ ప్రొటెక్షన్ రేటింగ్: మహీంద్రా XUV 3XO పిల్లల భద్రత విషయంలో 49కి 43 పాయింట్లను పొందింది. అయితే SUV వెహికల్ ఎవల్యూషన్లో మంచి స్కోర్ అందుకోలేకపోయింది. కానీ ఇది డైనమిక్ క్రాష్ టెస్ట్, చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ పారామీటర్లలో పూర్తి మార్కులు సాధించింది.
3. మహీంద్రా XUV400 EV భద్రతా రేటింగ్: ఈ కారు కూడా భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలు, పిల్లల భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ రేటింగ్ మహీంద్రా XUV400 అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది. మహీంద్రా లైనప్‌లో ఇప్పటివరకు ఉన్న ఏకైక ఆల్-ఎలక్ట్రిక్ కారు ఇదే. దీన్ని రెండేళ్ల క్రితం ఇండియాలో ప్రారంభించారు.
- అడల్ట్ సేఫ్టీ రేటింగ్: క్రాష్ టెస్ట్‌లో పెద్దల భద్రత విషయంలో XUV400 32కి 30.38 పాయింట్లు సాధించింది. ఇది కాకుండా ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో ఈ కారు 16 పాయింట్లకు 14.38 స్కోర్ చేయగా.. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో ఇది 16 పాయింట్లకు 16 స్కోర్ చేయగలిగింది.
- చైల్డ్ ప్రొటెక్షన్ రేటింగ్: మహీంద్రా XUV400 చైల్డ్ సేఫ్టీ విషయంలో 49కి 43 పాయింట్లను పొందింది. చైల్డ్ ప్రొటెక్షన్‌లో డైనమిక్ స్కోర్ 24కి 24గా ఉంది. చైల్డ్ రెస్ట్రెయింట్ ఇన్‌స్టాలేషన్ విషయంలో కారుకు 12కి 12 పూర్తిగా వచ్చింది. అయితే ఈ కారు ఎవల్యూషన్ స్కోర్ మాత్రం 13 పాయింట్లకు 7 మాత్రమే పొందగలిగింది.
దేశంలోనే చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చిన జియో!- రూ.11కే 10GB హై స్పీడ్ డేటా- కానీ..!
కొత్త మారుతి డిజైర్ vs పాత డిజైర్- ఇలాంటి అప్డేట్స్ ఎప్పుడూ చూడలేదు భయ్యా!