వరుస లాభాల నేపథ్యంలో గురువారం ఒక్కసారిగా వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
బొంబయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 33,981 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 10,029 వద్దకు చేరింది. ఆర్థిక రంగ షేర్లలో ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటడం సహా భారత రేటింగ్‌ను దిగువకు సవరిస్తూ రేటింగ్ ఏజెన్సీలు నివేదికలు విడుదల చేయడం కూడా నష్టాలకు కారణంగా తెలిస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 34,310 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,711 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,123 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 9,944 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ షేర్లు లాభాలను గడించాయి.
ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి గురువారం 10 పైసలు క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 75.57 వద్ద స్థిరపడింది.
ఇది చూడండి:శాంసంగ్ గెలాక్సీ ఏ-31 వచ్చేస్తోంది.. ధరెంతో తెలుసా?