స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒకదశలో 39,000 పాయింట్ల స్థాయికి పైన, నిఫ్టీ 11,700 పాయింట్లపైన ట్రేడైంది.
శుక్రవారం 38,862 పాయింట్ల వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్... సోమవారం 38,993.60 పాయింట్లతో ప్రారంభమైంది. ఆరంభంలో 150.99 పాయింట్లు (0.39 శాతం) పెరిగి 39,013.22 వద్ద ట్రేడైంది. నిఫ్టీ 11,704 .35 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది.
మార్కెట్లు ప్రస్తుతం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. 6పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 38856 వద్ద ట్రేడవుతుండగా... నిఫ్టీ 11651 వద్ద నిలిచింది.
ఆసియా మార్కెట్లు...
అంచనాలకు మించిన అమెరికా ఉద్యోగాల సమాచారం, వాషింగ్టన్-బీజింగ్ వాణిజ్య చర్చల పురోగతి నేపథ్యంలో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. లోహ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ రంగాలు పుంజుకున్నాయి.
క్షీణించిన రూపాయి...
రూపాయి విలువ 27 పైసలు క్షీణించి యూఎస్ డాలర్‌తో మారకం విలువ రూ.69.50కు చేరింది.