ETV Bharat / business

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్‌లు ఇవే...

కొవిడ్​ సంక్షోభం కారణంగా వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆధారపడిన సీనియర్‌ సిటిజెన్లకు ఇటీవల కాలంలో ఆదాయం బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో కొన్ని బ్యాంకులు వీరి కోసం ప్రత్యేక పథకాలను అందిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం..

author img

By

Published : May 23, 2021, 2:21 PM IST

FD SCHEME, SENIOR CITEZENS
సీనియర్​ సిటిజన్​, ఎఫ్​డీ స్కీమ్​

క‌రోనా నేప‌థ్యంలో వేగంగా ప‌డిపోతున్న వ‌డ్డీ రేట్ల నుంచి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ను ప‌రిర‌క్షించేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌క‌మే సీనియ‌ర్ సిటిజ‌న్ స్పెష‌ల్ డిపాజిట్ స్కీమ్‌. ఈ ప‌థ‌కం గ‌డువు తేది మార్చి 30తో ముగియ‌గా.. 2021 జూన్ 30 వ‌ర‌కు పొడిగిస్తూ బ్యాంకులు నిర్ణ‌యం తీసుకున్నాయి. సాధారణంగా ఫిక్స‌డ్ డిపాజిట్(ఎఫ్​డీ)లో ఇత‌రుల‌కు ఆఫ‌ర్ చేసే వ‌డ్డీ రేట్ల కంటే 50 బేసిస్ పాయింట్లు అద‌నంగా సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు బ్యాంకులు ఇస్తుంటాయి. అయితే.. స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్‌లు అంత‌కంటే ఎక్క‌వ వ‌డ్డీనే అందిస్తాయి. కొత్త‌గా చేసే డిపాజిట్ల‌తో పాటు, పున‌రుద్ధ‌ర‌ణ డిపాజిట్ల‌కు ఇవి వ‌ర్తిస్తాయి.

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా.. వంటి బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందించే స్పెష‌ల్ డిపాజిట్ స్కీమ్‌లు వాటి వివ‌రాలు..

ఎస్‌బీఐ 'వుయ్‌కేర్ డిపాజిట్‌'..

గ‌తేడాది మే నెల‌లో 'వుయ్​ కేర్​(wecare)' డిపాజిట్‌ను ప్రారంభించింది ఎస్‌బీఐ. దీని ద్వారా ఫిక్స‌డ్ డిపాజిట్ల‌పై ఇత‌రుల‌కిచ్చే వ‌డ్డీ రేటు కంటే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 80 బేసిస్ పాయింట్ల‌(బీపీఎస్‌) మేర అద‌న‌పు వ‌డ్డీని అందిస్తుంది. ఈ స్పెష‌ల్ డిపాజిట్ స్కీమ్ కింద డిపాజిట్లు చేసిన పెద్ద‌ల‌కు 6.20 శాతం వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్‌..

సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే 75 బేసిస్ పాయింట్లు అద‌న‌పు వ‌డ్డీరేటును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్ ఎఫ్‌డీల‌కు ఆఫ‌ర్ చేస్తుంది. ఈ స్పెష‌ల్ డిపాజిట్ల‌పై 6.25 శాతం వ‌డ్డీ రేటును బ్యాంక్ పెద్ద‌ల‌కు అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయ‌ర్స్‌..

ఫిక్స‌డ్ డిపాజిట్ల‌పై ఇత‌రుల‌కు ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 80 బేసిస్ పాయింట్ల‌(బీపీఎస్‌) మేర అద‌న‌పు వ‌డ్డీని అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియ‌ర్ సిజిజ‌న్ కేర్ ఎఫ్‌డీపై వార్షికంగా 6.30 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా..

ఈ ప‌థ‌కం కింద సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇచ్చే వ‌డ్డీ రేట్ల‌తో పోలిస్తే, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 100 బేసిస్ పాయింట్లు అద‌న‌పు వ‌డ్డీ రేటు ల‌భిస్తుంది. ఈ స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో 5 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డి, 10 సంవ‌త్స‌రాల‌లోపు డిపాజిట్ చేసే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 6.25శాతం వ‌డ్డీని బ్యాంక్‌ అందిస్తుంది.

ఇదీ చదవండి: ఎఫ్​డీలపై ఏ బ్యాంక్​ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.