పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి చెందిన జప్తు చేసిన విలువైన వస్తువులను కేంద్రం వేలం వేయనుంది. రెండు వేలంపాటల్లో 15 చిత్రకళాఖండాలు, లగ్జరీ గడియారాలు, 80 బ్రాండెడ్ హ్యాండ్‌బ్యాగ్‌లు, కార్లను వేలానికి పెట్టనున్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరఫున ముంబయికి చెందిన సాఫ్రోనార్ట్ సంస్థ ఈ వేలం నిర్వహించనుంది. మొదటి వేలం ముంబయిలో ఫిబ్రవరి 27న జరగనుండగా, రెండో వేలం మార్చ్ 3 నుంచి 4 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. 2 పెయింటింగ్స్ అత్యధికంగా 12-18 కోట్ల రూపాయలకు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నారు. వేలానికి పెట్టనున్న కొన్ని వస్తువులను.. దిల్లీలోని సాఫ్రొనార్ట్ గ్యాలరీలో ఈ నెలాఖరున జరగనున్న ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకును నకిలీ 'లెటర్ ఆఫ్ అండర్టేకింగ్' (ఎల్ఓయూ)ల ద్వారా దాదాపు రూ.14 వేల కోట్లకు మోసగించారు నీరవ్ మోదీ.