ETV Bharat / business

ట్విట్టర్​ నుంచి సరికొత్త ఫీచర్..​​ మీకోసమే - ట్విట్టర్​

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ సరికొత్త ఫీచర్​ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. మనం పోస్ట్​ చేయాలనుకున్న ట్వీట్​ను.. నిర్దిష్ట సమయంలో పంపించే వెసులుబాటును అందుబాటులోకి తేనుంది. ఎడిట్​ ఆప్షన్​నూ ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది.

Schedule your tweets for release at specific date and time soon  `
ట్విట్టర్​ నుంచి ఈ సరికొత్త ఫీచర్​​ మీకోసమే!
author img

By

Published : May 10, 2020, 7:32 PM IST

'మిస్టర్​ ఫర్​ఫెక్ట్' సినిమాలో కాజల్​కు ప్రభాస్​ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే సీన్​ గుర్తుందా? ఆ సన్నివేశంలో ముందుగానే తన ల్యాప్​టాప్​లో ఓ వీడియో చిత్రీకరించి.. నిర్దేశిత సమయానికి విషెస్​ వెళ్లేలా సెట్​ చేస్తాడు. ఇప్పుడిదంతా ఎందుకంటారా! సరిగ్గా ఈ తరహా ఫీచర్​ను త్వరలో మీ ముందుకు తీసుకురానుంది సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​.

ప్రస్తుతం ఈ ప్రత్యేకత.. డెస్క్​టాప్​లో 'ట్విట్టర్ ఫర్ డెస్క్' వాడే ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ షెడ్యూల్​ ఫీచర్​ ​అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు ఈ ఫీచర్​ను తీసుకురానున్నట్లు వెల్లడించింది.

దీని ద్వారా ముందుగానే ట్వీట్​ సిద్ధం చేసుకొని.. నిర్దిష్ట సమయానికి సెండ్​ అయ్యే వెసులుబాటు ఉంటుంది. ట్వీట్​ వెళ్లే ముందు.. ఒకసారి సరిచేసేందుకూ అవకాశం కల్పించనుంది. అసభ్యకర పదాలు, వార్తలను గుర్తించేందుకు ఏఐ, ఎంఎల్​ టూల్స్​ను తయారు చేసినట్లు పేర్కొంది.

అయితే.. ఈ ఎడిట్​ ఆప్షన్​ ప్రస్తుతం ఐఓఎస్​ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇది ప్రయోగాత్మకంగా చేపడుతున్నట్లు వెల్లడించింది. సోషల్​ మీడియా మెనేజర్లు, మీడియా ప్రతినిధులకు ఈ తరహా సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతోందని ట్విట్టర్​ భావిస్తోంది.

ఇదీ చూడండి:' దేశంలో ఏడువేలకు పైగా కరోనా ప్రత్యేక ఆసుపత్రులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.