బుధవారం రాత్రి సమావేశమైన అమెరికా ఫెడ్ విధాన నిర్ణయ కమిటీ వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫెడ్ కమిటీ విడుదల చేసిన నివేదికలో అమెరికా ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతున్నట్లు పేర్కొంది.
ఆశ్చర్యకర నిర్ణయాలు:
2019, సెప్టెంబర్ నాటికి ఫెడ్ కనీసం మూడు సార్లు వడ్డీ రేట్లు పెంచుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. 2019 లో వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చనే సంకేతాలు పంపింది.
ఫెడ్ నిర్ణయంపై ఆర్థికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే 2020 లో వడ్డీ రేట్ల పెంపుతో పాటు కీలక సంస్కరణలు చేయాలని ఫెడ్ కమిటీ సమావేశంలో చర్చలు సాగినట్లు సమాచారం .
ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లు 2.25 నుంచి 2.5 శాతంగా ఉన్నాయి.