ETV Bharat / business

'మారటోరియంలో వడ్డీపై వడ్డీ' విచారణ వాయిదా

author img

By

Published : Nov 3, 2020, 3:01 PM IST

రుణాల వడ్డీపై వడ్డీ వ్యవహారంపై విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా విజ్ఞప్తి మేరకు త్రిసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

Supreme Court defers hearing on loan moratorium
'మారటోరియంలో వడ్డీపై వడ్డీ' విచారణ వాయిదా

మారటోరియం సమయంలో రుణాల వడ్డీపై వడ్డీకి సంబంధించిన పిటిషన్ల విచారణను ఈ నెల 5కు(గురువారం) వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

గురువారం(ననంబర్​ 5) నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్​యేతర సంస్థలు.. 2కోట్ల లోపు రుణాలు తీసుకున్న రుణ గ్రహీతల ఖాతాలో నగదును జమ చేస్తాయని రిజర్వు బ్యాంకు, ఆర్థికశాఖ ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో అదనపు అఫిడవిట్​ను దాఖలు చేశాయి.

ఈ వ్యాజ్యాల విచారణ సోమవారం జరగాల్సి ఉంది. మంగళవారం విచారణకు వచ్చాయి. అయితే కేంద్రం తరఫున మరో కేసులో వాదిస్తుండటం వల్ల.. మారటోరియం పిటిషన్ల విచారణను వాయిదా వేయాలన్న తుషార్​ మెహతా అభ్యర్థనను జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఆర్​ సుభాష్​ రెడ్డి, జస్టిస్​ ఎమ్​ఆర్​ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది.

ఇదీ చూడండి:- వడ్డీపై వడ్డీ మాఫీ.. ఎంత ఊరట?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.