ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు చేసి ఈఎంఐగా(SBI EMI) చెల్లించాలి అనుకునేవారిపై (SBI Credit Card Payment) ఇప్పుడు మరింత భారం పడనుంది. డిసెంబరు 1 నుంచి క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.99 (ట్యాక్సులు అదనం) ప్రాసెసింగ్ ఫీజు (SBI Credit Card Payment) వసూలు చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఈ-మెయిల్ సందేశం పంపింది.
"డిసెంబరు 1, 2021 నుంచి మర్చెంట్ ఈఎంఐ లావాదేవీలపై రూ.99 (+ పన్నులు) ప్రాసెసింగ్ ఫీజు (SBI Credit Card Payment) వసూలు చేయనున్నాం. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని మర్చంట్ అవుట్‌లెట్లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, యాప్‌లలో జరిపే ఈఎంఐ లవాదేవీలకు ఈ ఫీజు వర్తిస్తుంది" అని ఎస్‌బీఐ వెల్లడించింది. అంటే.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొని ఈఎంఐగా (SBI Credit Card Payment) మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ ఆప్షన్ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం పడనుంది.
ఉదాహరణకు.. మీరు ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో మొబైల్ ఫోన్ కొని దానికి ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి.. ఆ చెల్లింపులను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో చేస్తే మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద అదనంగా రూ.99 ప్లస్ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో ఈఎంఐ అమౌంట్‌తో కలిపి కన్పిస్తుంది. ఈఎంఐగా మార్చుకునే లావాదేవీలకు మాత్రమే ఈ ఫీజును ఛార్జ్ చేస్తారు. అయితే ఈఎంఐ లావాదేవీ రద్దయితే ఈ ఫీజును తిరిగి ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.
అయితే ఈ ప్రాసెసింగ్ ఫీజుకు.. కార్డు ఇంట్రెస్ట్ ఛార్జీలకు ఎలాంటి సంబంధం లేదు. కొన్ని సార్లు ఈఎంఐలకు(SBI EMI) మార్చుకున్నప్పుడు విక్రయదారులు వడ్డీలపై డిస్కౌంట్లు కల్పిస్తారు. జీరో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంటుంది. అలాంటి వాటికి కూడా ఈ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది.
ఇదీ చూడండి : వొడాఫోన్ ఐడియాకు రూ. 7 వేల కోట్ల నష్టం.. ఆదాయం డౌన్