దేశంలోని 20 ప్రధాన రాష్ట్రాల్లో కొవిడ్-19 టీకాను ప్రజలందరికీ వేసేందుకు రూ.3.7 లక్షల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. ఇటీవల లాక్‌డౌన్‌తో వాటిల్లిన రూ.5.5 లక్షల కోట్ల ఆర్థిక నష్టంతో పోలిస్తే ఇది తక్కువేనని పేర్కొంది.
యునిసెఫ్ గణాంకాల ప్రకారం కొవిడ్ వ్యాక్సిన్ ధర 2-40 డాలర్లుగా ఉంది. 5, 10, 20, 30, 40 డాలర్ల ధరలను రూపాయి మారకపు విలువ 73 వద్ద గణించాం. ఇక 50 శాతం వ్యాక్సిన్లను రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వనుండగా, మిగతా 50 శాతం రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన సిక్కింకు రూ.20 కోట్లు, ఉత్తర్ ప్రదేశ్కు రూ.67,100 కోట్ల (డోసు 40 డాలర్ల చొప్పున కొనుగోలు చేస్తే) మేర ఖర్చు కావొచ్చు.
-- సౌమ్యకాంతి ఘోష్, ఎస్‌బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు
అయితే ఈ లెక్కలు గరిష్ఠ పరిమితుల్లో వేసినవని, రాష్ట్రాల వారీగా ఖర్చుల్లో తేడాలు ఉండొచ్చని అన్నారు.
ఇదీ చదవండి : కేంద్రం తీరుపై 'సీరం' మండిపాటు- కారణమదే