జులై 4వ తేదిన భారతీయ స్టేట్ బ్యాంక్(SBI) సేవలకు అంతరాయం కలగనుంది. తెల్లవారుజామున సుమారు రెండు గంట పాటు సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది.
అంతర్గత సేవల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఆదివారం ఉదయం 3.25 గంటల నుంచి 5.50 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ట్విట్టర్ ద్వారా ఎస్బీఐ తెలిపింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పనిచేయవని పేర్కొంది.
మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి మేము ప్రయత్నిస్తున్నామని తెలిపిన ఎస్బీఐ.. వినియోగదారులు ఈ సమయంలో సహనం వహించాలని కోరింది.
ఇదీ చూడండి: Facebook: ఆ కంటెంట్లపై ఫేస్బుక్ చర్యలు