ETV Bharat / business

కస్టమర్లకు గుడ్​న్యూస్​.. ఎఫ్​డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్​బీఐ - ఫిక్స్​డ్​ డిపాజిట్

SBI FD Rates: ఎస్​బీఐ కీలక ప్రకటన చేసింది. రూ.2 కోట్లకు పైబడిన ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. ఈనెల 10 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.

sbi
ఎస్​బీఐ
author img

By

Published : Mar 12, 2022, 8:33 AM IST

SBI FD Rates: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2 కోట్లకు పైబడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20-40 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచినట్లు వెల్లడించింది. ఈ నెల 10 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తన వెబ్‌సైట్​లో పేర్కొంది. 211 రోజుల వ్యవధి డిపాజిట్లపై 3.30 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 3.80శాతం వడ్డీ చెల్లిస్తోంది.

ఏడాది నుంచి 10 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 3.60శాతం, వయోధికులకు 4.10శాతం వడ్డీ లభిస్తుంది. ఇక రూ.2 కోట్లలోపున్న డిపాజిట్లపై రెండు- మూడేళ్ల కాలవ్యవధికి 5.20శాతం, మూడు నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై 5.45శాతం వడ్డీని అందిస్తోంది. 5-10 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 5.50శాతం వడ్డీనిస్తోంది.

ఇదీ చూడండి : పేటీఎంకు ఆర్​బీఐ షాక్‌- కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై బ్యాన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.