ETV Bharat / business

ఎస్​బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు... వారికి నష్టం, వీరికి లాభం... - స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్​బీఐ అన్ని రకాల పొదుపు ఖాతాలపై 0.25 శాతం వడ్డీ రేట్లు తగ్గించింది. దీనితో వార్షిక వడ్డీరేటు ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గనుంది. అటు... వార్షిక ఎంసీఎల్​ఆర్​నూ సవరించగా... గృహ రుణాల ఈఎంఐ కాస్త తగ్గనుంది.

SBI cuts savings rate by 25 bps to 2.75 pc
ఎస్​బీఐ పొదుపు ఖాతాలపై 0.25 శాతం వడ్డీరేటు తగ్గింపు
author img

By

Published : Apr 7, 2020, 8:00 PM IST

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్​బీఐ అన్ని రకాల పొదుపు ఖాతాలపై 0.25 శాతం మేర వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో పొదుపు వార్షిక వడ్డీరేటు ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 2.75 శాతానికి దిగిరానుంది. ఈ కొత్త వడ్డీరేట్లు 2020 ఏప్రిల్ 15 నుంచి అమలు అవుతాయని ఎస్​బీఐ స్పష్టం చేసింది.

వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరిగిన దృష్ట్యా సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది ఎస్​బీఐ.

ఎంసీఎల్​ఆర్​ భారీ తగ్గింపు

ఎస్​బీఐ నేడు ఎంసీఎల్ఆర్​నూ 0.35 శాతం తగ్గించింది. దీనితో ఇంటి రుణాలు, ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

వార్షిక ఎంసీఎల్​ఆర్​ 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుందని, ఇది 2020 ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్​బీఐ స్పష్టం చేసింది. దీనితో 2019-20 సంవత్సరంలో ఎంసీఎల్​ఆర్​లో వరుసగా 11వ సారి కోత విధించినట్లైందని ఎస్​బీఐ పేర్కొంది.​

అర్హత గల గృహ రుణగ్రహీతలకు.... వడ్డీ మొత్తం రూ.లక్షకు సుమారు రూ.24 వరకు తగ్గనున్నట్లు ఎస్​బీఐ తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి ఇది శుభవార్త.

ఇదీ చూడండి: దేశంలో భారీగా తగ్గిన నియామకాలు.. కారణం ఇదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.