ETV Bharat / business

Sbi 3 In 1 Account: ఎస్‌బీఐ 3-ఇన్‌-1 ఖాతా- ఫీచర్లు ఇవే.. - ఎస్​బీఐ న్యూ ఫీచర్స్​

Sbi 3 In 1 Account: స్టేట్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) తమ వినియోగదారుల కోసం కొత్త సౌకర్యాన్ని తీసుకువచ్చింది. దేశంలో స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. వారందరినీ సురక్షితమైన ప్రభుత్వం రంగ బ్యాంకు వైపు మళ్లించేందుకు 3 ఇన్‌ 1 ఖాతాను అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో సేవింగ్స్‌ ఖాతాతో పాటు డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు కూడా ఉంటాయి.

sbi 3 in 1 account
ఎస్‌బీఐ 3-ఇన్‌-1 ఖాతా
author img

By

Published : Dec 18, 2021, 3:49 PM IST

Sbi 3 In 1 Account: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) తమ వినియోగదారుల సౌకర్యార్థం నిరంతం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే కస్టమర్లకు జీరో బ్యాలెన్స్‌, జన్‌ధన్‌, సేవింగ్స్‌, కరెంటు ఇలా పలు రకాల ఖాతాలు అందిస్తోంది. తాజాగా మరో కొత్త రకం ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చింది.

3-ఇన్‌-1 ఖాతా

Sbi Stock Market Investing: దేశంలో స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో అనేక మంది డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే, చాలా మంది వీటి కోసం ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎస్‌బీఐ వారందరినీ సురక్షితమైన ప్రభుత్వం రంగ బ్యాంకు వైపు మళ్లించేందుకు 3 ఇన్‌ 1 ఖాతాను తీసుకొచ్చింది. దీంట్లో సేవింగ్స్‌ ఖాతాతో పాటు డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు కూడా ఉంటాయి.

sbi 3 in 1 account
.

Sbi 3 In 1 Account Features:

  • ఎస్‌బీఐ త్రీ ఇన్ వన్ అకౌంట్ హోల్డర్స్ 25 శాతం మార్జిన్స్‌తో ట్రేడ్ చేయొచ్చు. దీన్ని ఈ-మార్జిన్‌ ఫెసిలిటీగా వ్యవహరిస్తున్నారు.
  • మార్జిన్‌ స్టాక్స్‌ లేదా నగదు రూపంలో ఉంటుంది. కస్టమర్లు తమకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు
  • 30 రోజుల వరకు పొజిషన్స్‌ను క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు.
  • ట్రేడింగ్ స్టాక్స్‌ని డెలివరీగా మార్చుకోవచ్చు. ఎక్స్‌పైరీ లోపు స్క్వేర్ ఆఫ్ కూడా చేయొచ్చు.
  • వీటితో పాటు సేవింగ్స్‌ ఖాతా ద్వారా అందే అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి.

ఇదీ చూడండి: డిజిటల్‌ కరెన్సీ, ప్రైవేట్‌ క్రిప్టోలపై ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు చర్చ

కావాల్సిన డాక్యుమెంట్లు

Sbi savings account: సేవింగ్స్‌ ఖాతా..

- పాన్‌ లేదా ఫారం 60
- ఫొటోలు
- కింది వాటిలో ఏదైనా ఒకటి
పాస్‌పోర్ట్‌, ఆధార్‌ కార్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ కార్డు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు, ఎన్‌పీఆర్‌ విడుదల చేసిన డాక్యుమెంట్‌

sbi 3 in 1 account
.

Sbi demat account: డీమ్యాట్‌ అండ్‌ ట్రేడింగ్‌ అకౌంట్‌

- పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో
- పాన్‌కార్డు

- ఆధార్‌ కార్డు
- క్యాన్సిల్‌ చేసిన చెక్‌/ తాజా బ్యాంకు స్టేట్‌మెంట్లు

Sbi e margin: ఈ-మార్జిన్‌ ఫెసిలిటీ ఎలా ఉపయోగించుకోవాలంటే

sbi 3 in 1 account
.
  • ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌ వెబ్‌లో ట్రేడింగ్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ కావాలి.
  • ఆర్డర్‌ ప్లేస్‌మెంట్‌(బై/సెల్‌) మెనూలోకి వెళ్లాలి
  • ప్రోడక్ట్‌ టైప్‌ని ఈ-మార్జిన్‌గా ఎంపిక చేసుకొని ఆర్డర్‌ ప్లేస్ చేయాలి.

ఇవీ చూడండి:

India Spam Calls: 'ఒకే నంబర్‌ నుంచి 20 కోట్ల స్పామ్‌ కాల్స్‌'

బడా ఇన్వెస్టర్లతో మోదీ భేటీ.. ఆ సంస్కరణలపై చర్చ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.