ETV Bharat / business

ఏడాది చివరి నాటికి సనోఫి-జీఎస్​కే టీకా! - మార్కెట్లోకి ఈ ఏడాది సనోఫి కరోనా వ్యాక్సిన్

సనోఫి, గ్లాక్సోస్మిత్​క్లైన్ (జీఎస్​కే) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్​ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. రెండో దశ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చినందున త్వరలో తుది దశ ట్రయల్స్​, ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి.

Sanofi GSK vaccine trails news
సనోఫి జీఎస్​కే వ్యాక్సిన్​ కరోనా వ్యాక్సిన్ అప్​డేట్
author img

By

Published : May 17, 2021, 6:38 PM IST

ఫ్రాన్స్​కు చెందిన సనోఫి ఫార్మా కంపెనీ, బ్రిటన్​కు చెందిన గ్లాక్సోస్మిత్​క్లైన్ (జీఎస్​కే) ఫార్మా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రాథమిక పరీక్షల్లో సానుకూల ఫలితాలను ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఇటీవల నిర్వహించిన రెండో దశ ట్రయల్స్​లో వయోజనులందరిలోనూ సమర్ధంగా రోగనిరోధక శక్తిని పెంచినట్లు వెల్లడించాయి.

ఈ వ్యాక్సిన్ ప్రారంభ పరీక్షల్లో ప్రతికూలతలు ఎదుర్కొన్న కారణంగా ట్రయల్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. తిరిగి ట్రయల్స్ ప్రారంభించగా మునుపటి ఇబ్బందులను అధిగమించి సానుకూల ఫలితాలను ఇస్తుండటం విశేషం.

త్వరలోనే తుది దశ ట్రయల్స్​కు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. రానున్న వారాల్లోనే ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి. 2021 చివరి నాటికి ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా లభిస్తాయని ఇరు సంస్థలు అశాభావం వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి:టీకా ఉత్పత్తికి మరో సంస్థతో జత కట్టిన డా.రెడ్డీస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.