దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ 'గెలాక్సీ ఏ 51' కొత్త వేరియంట్‌ను భారత్‌లో విడుదల చేసింది. జెనరేషన్ జెడ్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు శాంసంగ్ తెలిపింది.
గెలాక్సీ ఏ 51 ఫీచర్స్:
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ పవర్డ్ గేమ్ బూస్టర్‌తో కూడిన 10 ఎన్ఎమ్ ఎక్సినోస్ 9611 చిప్సెట్ ఉంది. దీని వల్ల మెరుగైన ఫ్రేమ్ రేటు, స్టెబిలిటీ వస్తుంది. పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది.
- 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో)... దీని ద్వారా 19 గంటల పాటు నిరంతరాయంగా వీడియోలు చూడవచ్చని కంపెనీ చెబుతోంది.
- గెలాక్సీ ఏ 51... ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ వైట్, ప్రిజం క్రష్ బ్లూ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.
కెమెరా ఫీచర్స్
- 48 ఎంపీ ప్రధాన కెమెరా
- 12 ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్ (నైట్మోడ్ క్యాపబులిటీ )
- 5 ఎంపీ మాక్రో లెన్స్ (క్లోజప్ షాట్స్ కోసం)
- 5 ఎంపీ డెప్త్ కెమెరా (లైవ్ ఫోకస్ మోడ్)
ధర ఎంతో తెలుసా?
8జీబీ+128 జీబీ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఏ 51.... భారత మార్కెట్లో రూ.27,999కి అందుబాటులో ఉంది. అన్ని రిటైల్ దుకాణాలు, ఇ-కామర్స్ పోర్టల్స్, శాంసంగ్.కామ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
త్వరలో భారత మార్కెట్లోకి గెలాక్సీ ఏ 31
గెలాక్సీ ఏ 31ని జూన్ 4న భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు శాంసంగ్ తెలిపింది.
గెలాక్సీ ఏ 31 ఫీచర్లు
- క్వాడ్ కెమెరా
- 48 ఎంపీ ప్రధాన కెమెరా
- 8 ఎంపీ ఆల్ట్రావైడ్ కెమెరా
- 5 ఎంపీ మాక్రో కెమెరా
- 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- 16.21 సెం.మీ ఎఫ్‌హెచ్‌డీ+ఎస్ అమోలెడ్ ఇన్ఫినిటీ- యూ డిస్ప్లే సహా మరెన్నో ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది.
ఇదీ చూడండి: భారత వృద్ధిరేటు 5 శాతం క్షీణిస్తుంది: ఎస్ అండ్ పీ